Posts

Showing posts from October, 2024

Materani Chinnadani Song Lyrics in English & Telugu

Image
Materani Chinnadani Song Lyrics in Telugu మాటే రాని చిన్నదాని కళ్ళు పలికే ఊసులు.. అందాలన్నీ పల్లవించీ ఆలపించే పాటలు.. ప్రేమే నాకు పంచే..జ్ఞాపకాలురా.. రేగే మూగ తలపే..వలపు పంటరా!! మాటే రాని చిన్నదాని కళ్ళు పలికే ఊసులు.. అందాలన్నీ పల్లవించీ ఆలపించే పాటలు.. ప్రేమే నాకు పంచే..జ్ఞాపకాలురా.. రేగే మూగ తలపే..వలపు పంటరా!! వెన్నెలల్లే పూలు విరిసే తేనెలు చిలికెను.. చెంతచేరి ఆదమరచి ప్రేమలు కొసరెను.. చందనాలు జల్లు కురిసె చూపులు కలిసెను.. చందమామ పట్టపగలే నింగిని పొడిచెను!! కన్నె పిల్ల కలలే నాకిక లోకం.. సన్నజాజి కళలే మోహన రాగం.. చిలకల పలుకులు అలకల ఉలుకులు నా చెలి సొగసులు నన్నే మరిపించే!! మాటే రాని చిన్నదాని కళ్ళు పలికే ఊసులు.. అందాలన్నీ పల్లవించీ ఆలపించే పాటలు.. ముద్దబంతి లేత నవ్వులు చిందెను మధువులు.. ఊసులాడు మేని వగలు వన్నెల జిలుగులు.. హరివిల్లులోని రంగులు నాచెలి సొగసులు వేకువల మేలుకొలుపే  నా చెలి పిలుపులు సందెవేళ పలికే నాలో పల్లవి.. సంతసాల సిరులే నావే అన్నవి.. ముసి ముసి తలపులు తరగని వలపులు.. నా చెలి సొగసులు అన్నీ ఇక నావే!! మాటే రాని చిన్నదాని కళ్ళు పలికే ఊసులు.. అందాలన్నీ పల్లవించీ ఆలపించే పాటలు...